ETV Bharat / state

జనావాసాల్లోకి ఎలుగుబంటి.. ఆందోళనలో ప్రజలు - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

అరణ్యంలో ఉండాల్సిన ఎలుగుబంటి జనాల్లోకి వచ్చింది. అక్కడున్న స్థానికులను కాసేపు కంగారు పెట్టింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగింది.

జనావాసాల్లోకి ఎలుగుబంటి
జనావాసాల్లోకి ఎలుగుబంటి
author img

By

Published : May 17, 2022, 7:29 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. పట్టణ శివారులోని ఓ మామిడి తోటలో భల్లూకం ప్రవేశించింది. గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ఎలుగుబంటిని పరిశీలించి అనారోగ్యంగా ఉందని చెప్పారు. దానిని పట్టుకొని సంరక్షణ కేంద్రాంనికి పంపేందుకు జూ అధికారుల అవసరం ఉందని తెలిపారు.

వెంటనే.. హైదరాబాద్​లోని నెహ్రూ జులాజికల్ పార్క్ వారికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది. అధికారుల సమన్వయం చేసుకోకపోవడం వల్లే.. ఎలుగుబంటి పారిపోయిందని స్థానికులు ఆరోపించారు. పట్టణంలో భల్లూకం సంచరిస్తుందన్న విషయం ప్రచారం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

ఇదీ చదవండి: 'నేను ఎవర్నీ దత్తత తీసుకోలేదు.. కలెక్టర్‌కు అంతా చెప్పాను'

చిరుత పిల్లలకు బాటిల్​తో నీళ్లు.. దగ్గర్లోనే తల్లి.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.