మాటల యుద్ధం తీరా ప్రత్యక్ష యుద్ధంగా మారింది. నేతల మధ్య మాటలు.. శ్రేణుల మధ్య దాడుల దాకా వెళ్లాయి. 'గోబ్యాక్ నినాదాలు, కార్యకర్తల ఘర్షణలు, పోలీసుల లాఠీఛార్జ్'లతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటన రెండో రోజు సైతం ( Bandi Sanjay second day tour news) రణరంగాన్ని తలపించింది.
గందరగోళం మధ్యే..
ఉదయం సూర్యాపేట జిల్లా చివ్వెంలకు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న తెరాస శ్రేణులు ముందుగానే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని.. సంజయ్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అప్పటికే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భాజపా కార్యకర్తలు.. తెరాస శ్రేణులను అడ్డుకునే యత్నం చేయగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలోనే బండి సంజయ్ అక్కడికి చేరుకోవటంతో.. రెండు పార్టీల కార్యకర్తలు (Bandi Sanjay second day tour news) రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే రాళ్లదాడి చేసుకోవటంతో.. ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టగా.. గందరగోళం మధ్యే చివ్వెంలలోని ఐకేపీ కేంద్రం వద్ద బండి సంజయ్ రైతులతో మాట్లాడారు.
ఘర్షణలో కుప్పకూలిన రిజర్వ్ ఇన్‌స్పెక్టర్..
చివ్వెంల నుంచి ఆత్మకూరు(ఎస్)కు బండి సంజయ్ చేరుకోగా.. తెరాస, భాజపా శ్రేణులు పరస్పర నినాదాలతో (Bandi Sanjay second day tour in suryapet district)ఉద్రిక్తత నెలకొంది. ఐకేపీ కేంద్రం వద్ద సంజయ్ రైతులతో మాట్లాడుతుండగా... గులాబీ శ్రేణులు 'గో బ్యాక్' నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే భాజపా, తెరాస కార్యకర్తలు ఒకరినొకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో చేసేదిలేక పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో ఆందోళనకారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ అస్వస్థతకు గురై.. కుప్పకూలిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. గంటన్నర పాటు గందరగోళం మధ్యే సంజయ్ పర్యటన కొనసాగింది.
కోడిగుడ్లు, కర్రలతో దాడులు..
సూర్యాపేట జిల్లాలో చివ్వెంల, ఆత్మకూరు పర్యటనల అనంతరం, బండి సంజయ్.... అర్వపల్లి వెళ్లాల్సి (Bandi Sanjay tour latest news) ఉండగా.. అక్కడికి వెళ్లకుండానే తిరుమలగిరికి వెళ్లారు. దీంతో అర్వపల్లిలో తెరాస శ్రేణులు బాణాసంచా కాల్చి.. నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే భాజపా-తెరాస కార్యకర్తలు మరోసారి రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాలు కోడిగుడ్లు, కర్రలతో దాడులు చేసుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తకు దారితీసింది.
తిరుమలగిరిలోనూ..
సూర్యాపేట శివారులో భాజపా శ్రేణుల కారు అద్దాలను తెరాస కార్యకర్తలు (tension in Bandi sanjay tour in suryepet) ధ్వంసం చేశారు. సంజయ్ కార్యక్రమానికి వెళ్తున్న భాజపా శ్రేణుల కారుపై దాడి చేశారు. సూర్యాపేట రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ వద్దనే దాడి జరిగింది. ఈ దాడిపై తిరుమలగిరిలో భాజపా శ్రేణుల రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భాజపా శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు.
బండి సంజయ్‌పై కేసు..
బండి సంజయ్ తన పర్యటనకు అనుమతి తీసుకోలేదని నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా అనుమతి లేకుండా పర్యటన సరికాదన్న ఆయన... సంజయ్‌తో పాటు ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇవీచూడండి:
- High Tension at Bandi Sanjay Tour: బండి సంజయ్ పర్యటనలో మరోసారి ఉద్రిక్తత.. ఆత్మకూరు(ఎస్)లో హైటెన్షన్
- Bandi sanjay news: చివ్వెంలలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న భాజపా, తెరాస కార్యకర్తలు
- Bandi Sanjay Tour: రణరంగంగా బండి సంజయ్ పర్యటన.. అడుగడుగునా దాడులు
- Bandi Sanjay on TRS riots: 'తెరాస దాడులకు సీఎం కేసీఆరే సూత్రధారి'
- Bandi sanjay: బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత.. గో బ్యాక్ అంటూ నినాదాలు
- bandi sanjay: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటన.. ఆ ప్రాంతాలపైనే దృష్టి