సూర్యాపేట జిల్లా పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ జెన్‌కో మరింత పెంచింది. పులిచింతలలోని నాలుగు యూనిట్లలో తెలంగాణ జెన్‌కో కరెంట్ ఉత్పత్తి చేస్తూ.. 14,250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోంది. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఉత్పత్తిని పెంచడం చర్చనీయాంశమవుతోంది.
60 మెగావాట్లకు పైగా ఉత్పత్తి జరుగుతోందని పులిచింతల అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం పెరుగుతున్న జలాశయాల్లో... విద్యుదుత్పత్తిని పెంచుతున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరగడంతో... నాలుగో యూనిట్‌ను అందుబాటులోకి తెచ్చారు. జల విద్యుదుత్పత్తి ఆపాలని ఏపీ అధికారులు విజ్ఞప్తి చేసినా.. తెలంగాణ జెన్‌కో అధికారులు లెక్కచేయకుడా ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: ZOO PARKS OPEN: జూపార్కులు, ఉద్యానవనాలు తెరిచేందుకు అనుమతి