సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉపఎన్నికల్లో భాగంగా తెరాస అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని నేడు హుజూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి హాజరై సభనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు... కారు గుర్తుకు ఓటేయాలంటూ విస్తృత ప్రచారం నిర్వహించారు. సభాస్థలిని, ఏర్పాట్లను మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్, హుజూర్నగర్ ఇన్‌ఛార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కేసీఆర్ పాల్గొనే ఈ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండిః మధ్యాహ్నం హుజూర్నగర్ ప్రచార సభకు ముఖ్యమంత్రి