ETV Bharat / state

భూగర్భ జలాల పెంపు కోసం నీటి పారుదల శాఖ వ్యూహాలు

ఈ వేసవి కాలంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని జల వనరులు అడుగంటిపోయాయి. వర్షపు నీటిపై ఆశలు పెట్టుకున్నా ఇప్పటికీ వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తున్నాయి. భూగర్భ జలాల రక్షణకు చిన్న,మధ్య, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో ప్రవహిస్తున్న నీటిని వాడుకునేందుకు నీటి పారుదల శాఖ ప్రణాళికలు వేసింది.

భూగర్భ జలాల పెంపు కోసం నీటి పారుదల శాఖ వ్యూహాలు
author img

By

Published : Jul 5, 2019, 9:38 AM IST

వేసవిలో ఈసారి నమోదైన ఉష్ణోగ్రతల ప్రభావంతో జల వనరులన్నీ వట్టిపోయాయి. తటాకాలు, కాల్వలు, చెరువులు, కుంటల్లోని నీరంతా ఆవిరవ్వటంతో బీళ్లను తలపిస్తున్నాయి. తుంగతుర్తి, దేవరకొండ ప్రాంతంలోని చాలా మండలాల్లోని ప్రజలు తాగునీటికి సైతం తండ్లాడుతున్నారు. జూన్‌ నెలారంభం నుంచే వర్షాలు వస్తాయి.. అరక సాగుతుందన్న అన్నదాతల ఆశలు నెల దాటినా కలగానే మిగిలాయి. తాగు, సాగు నీటి ఇబ్బందులు తప్పాలంటే భూగర్భజలాల రక్షణ, పెంపులే తక్షణ ప్రత్యామ్నాయాలుగా నీటిపారుదల శాఖ భావించింది. జిల్లాలోని చిన్న, మధ్య, భారీ జలవనరుల్లో ప్రవహిస్తున్న నీటిని వీలైనంత మేరకు భూగర్భంలో దాచుకునేలా ప్రణాళికలు రచించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని నదులు, వాగులపై చెక్‌డ్యాంలను నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించింది.

రూ. 300 కోట్లతో 125 చెక్‌డ్యాంలు.. వర్షాలు కురిసిన సమయంలో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తుంటాయి. ఇవన్నీ దగ్గరలోని నదుల్లో కలుస్తూ.. చివరగా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. నీటి లభ్యత అవసరానికి మించి ఉన్నా.. వాటిని రక్షించుకోలేక పోవడంతో వేసవిలో తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తుతోంది. దీన్ని నివారించేందుకు ఈ వర్షపు నీటికి అడ్డుకట్టలు వేసి.. వృథా జలాలను పాతాళంలో నిల్వ చేసుకునేందుకు భారీగా నిధులు వెచ్చించనున్నారు. దీని కోసం ఉమ్మడి జిల్లాకు 125 చెక్‌డ్యాంలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణం కోసం రూ.300 కోట్ల నిధులకు పాలనాపరమైన అనుమతులను సైతం ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చేసింది. రెండు విడతలుగా పనులు..జిల్లాకు మంజూరైన 125 ఆనకట్టల నిర్మాణ పనులను రెండు విడతలుగా చేపట్టనున్నారు. అందులో భాగంగా మొదటి విడతలో 63 చెక్‌డ్యాంలను నిర్మిస్తారు. ఇందుకు వ్యయం చేసే రూ.150 కోట్ల నిధులు సైతం విడుదలయ్యాయి. మిగిలిన 62 చెక్‌డ్యాంలను వచ్చే ఏడాదిలో నిర్మిస్తారు. మొదటి విడతలో చేపట్టబోయే పనులు ఈ నెలలోనే ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

చెక్‌డ్యాంల నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు ముగిశాయి. క్షేత్రస్థాయిలో రూపొందిన ప్రాథమిక నివేదికలన్నీ ఉన్నతాధికారులకు చేరాయి.త్వరలో వాటికి సాంకేతిక అనుమతులు మంజూరు కానున్నాయి. వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.ఇప్పటికే టెండర్లు పిలిచేందుకు అవసరమైన ప్రక్రియ సైతం ముగిసింది.
-హామీద్‌ఖాన్‌, ఐబీ సీఈ, నల్గొండ

ఇవీ చూడండి: నేటి నుంచి కొత్త జడ్పీల పాలన

Intro:JK_TG_NLG_111_03_Vegtable_sagu_Pkg_TS10102

ఆ గ్రామంలో రైతులంతా కురగాయాల సాగే.....

మర్రిగూడ మండలం అజ్జలపురం గ్రామంలో ని రైతులంతా సన్న చిన్నకారు రైతులే ఇక్కడి వారంతా వ్యవసాయం మీద జీవనం సాగిస్తున్నారు వ్యవసాయం లో భాగంగా పశుపోషణ కూరగాయల సాగు ఇక్కడ రైతుల జీవనాధారం. నీటి వనరులు చాలా తక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ని రైతులంతా మెట్ట పంటలు ,ఆరుతడి పంటలైన పత్తి చెను సాగుచేస్తుంటారు.దీనితో కొద్దిపాటి నీటి వనరులున్న కానీ పర్క్టి ఒక్కరు కూరగాయల సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు .ఈ గ్రామంలో ని రైతులు దాదాపుగా అందరూ ఆకుకూరలు, కూరగాయలు సాగుచేస్తుంటారు. వీరు దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాల క్రితం నుండి ఆకుకూరలు సాగు చేస్తుంటారు.వీళ్ళు పండించిన ఆకుకూరలు, కూరగాయలను వీరికి సమీపంలో ఉన్న మాల్ మార్కెట్ కు తరలించి అమ్ముకుంటున్నారు.ఒకప్పుడు ఈ ఆకుకూరలు ,కూరగాయలు సాగు చాలా లాబాసాటిగా ఉండేదని ఇప్పుడు వర్షబావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లు పోయక నీటి ఎద్దడి నెలకొనడంతో ఆ కూరగాయల సాగును కాస్త తగ్గించారు.వీరు కుటుంబ మొత్తం వ్యవసాయం పై ఆధారపడి కూరగాయలు సాగుతో జీవనం సాగిస్తుంటారు.

గిట్టుబాటు ధర కరువాయే

పండించిన కూరగాయలకు,ఆకుకూరలకు మార్కెట్లో దళారుల బెడద వలన గిట్టుబాటు ధర ను పొందలేక పోతున్నామని ఎంతో కష్టపడి పని చేసి కూరగాయలు పండించి తిరా అమ్ముకుందామని మార్కెట్ కు తీసుకొస్తే దళారుల చేతివాటం తో నిజమైన రైతులమైన మేము గిట్టుబాటు ధర పొందలేక నస్టాపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం రాయితీలు కల్పించాలి

కూరగాయల సాగు చేసే రైతులకు సన్న చిన్నకారు రైతులకు ప్రభుత్వం నుచి వచ్చే రాయితీల ద్వారా వచ్చే వ్యవసాయ పరికరాలు అయిన బిందు సేద్యం తుంపర సేద్యం రాయితీలో కూరగాయల విత్తనాలు ,కూరగాయలు, ఆకుకూరలు సాగుకు సంబంధించిన రాయితీలు కల్పించినట్లయితే ఇంకా ఎక్కువ మొత్తంలో కూరగాయలు పండించి లాభాలు పొందుతామన్నారు.

Body:మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లా

Conclusion:పరమేష్ బొల్లం
9966816056

For All Latest Updates

TAGGED:

ground water
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.