సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం అక్రమ దందాలకు అడ్డాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున మఠంపల్లి నుంచి హైదరాబాద్ తరలిస్తోన్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
సుమారు 165 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా గతంలో రేషన్, గుట్కా దందాల్లో పీడీ యాక్ట్ కింద కేసు నమోదైన ఓ వ్యక్తి నడిపిస్తున్నట్లు వెల్లడించారు.
ఓ రాజకీయ నేత అండదండలతోనే ఈ దందా నడుస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రతిసారి డ్రైవర్లు, కూలీల పైన కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని, సూత్రధారులను పట్టుకోవడం లేదని విమర్శిస్తున్నారు.