ఎవరికైనా నాలుగైదు రోజులు జ్వరం వస్తే తప్పనిసరిగా కరోనా నిర్దరణ పరీక్షలు చేయించుకోవాలని సూర్యాపేట డీఎంహెచ్ఓ కోటాచలం సూచించారు. తుంగతుర్తి మండలంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుని డాక్టర్లకు పలు సూచనలిచ్చారు. కరోనా టెస్టులకు ప్రాధాన్యతనివ్వాలన్నారు.
నిర్దరణ పరీక్షలు చేయించుకోలేని పరిస్థితి ఏర్పడి లక్షణాలు కనిపిస్తే కరోనా కిట్టు తీసుకొని.. ఇంటి వద్దనే వాడాలన్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ.. ధైర్యంగా ఉండాలన్నారు.
సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నామని.. ఆక్సిజన్‌తో కూడిన పడకలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిర్మల్ కుమార్, మోహన్, జోష్న, వీణ, హెచ్ఈఓ గోవింద్ రెడ్డి, గాజుల సోమన్న, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: చైనా రాకెట్ కూలేది ఎక్కడంటే..?