ETV Bharat / state

ఆన్​లైన్ తరగతులను పరిశీలించిన తుంగతుర్తి ఎంఈవో - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో ఎంఈవో బోయిని లింగయ్య ఆన్​లైన్ తరగతులను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో చదివే దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి రోజూ ఆన్​లైన్ తరగతులు తప్పనిసరిగా వినాలని సూచించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమని చెప్పారు.

suryapet  district tungaturti MEO examining online classes at ganugubanda
ఆన్లైన్ తరగతులను పరిశీలించిన తుంగతుర్తి ఎంఈవో
author img

By

Published : Oct 6, 2020, 1:58 PM IST

రోజూ ఆన్​లైన్ తరగతులు తప్పనిసరిగా వినాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల విద్యాధికారి బోయిని లింగయ్య సూచించారు. గానుగుబండ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదివే దివ్యాంగుల ఇళ్లకు సోమవారం వెళ్లి ఆన్​లైన్ తరగతులను పరిశీలించారు. ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.

పిల్లలు ఆన్​లైన్​ తరగతులు వింటున్నారా... లేదా అని తల్లిదండ్రులు నిత్యం పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గుడిపాటి అనిత, ఐఈఆర్​టీ ఉపేందర్, మధుకర్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆర్జిత సేవలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.