సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ముఖ్య కార్యనిర్వహణాధిరారి కర్నాటి శ్రీనివాస్, ఆసిస్టెంట్ సర్వన్నను విధుల నుంచి తొలగించినట్లు డీసీవో ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ నెలలో సంఘంలో ఫిక్సిడ్ డిపాజిట్లు, ఎరువుల విక్రయాలలో అక్రమాలు జరిగినట్లు గుర్తించి అధికారులు విచారణ చేపట్టారు.
విచారణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించి.. సదరు ఆధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న ఇద్దరిని విధుల నుంచి తొలగించినట్లు ప్రసాద్ తెలిపారు. గత పాలక వర్గ కాలంలో ఈ అక్రమాలు చోటుచేసుకున్నట్లు స్పష్టం చేశారు. రెండు రోజుల్లో జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించినున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: పీఆర్సీపై ఉద్యోగసంఘాల ఆగ్రహం.. పోలీసుల అప్రమత్తం