అత్యవసర, ఈ పాస్ ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ భాస్కరన్తో కలిసి కోదాడ మండలం రామాపురం వద్దనున్న ఏపీ, తెలంగాణ సరిహద్దు చెక్పోస్టును ఆయన సందర్శించారు. తెలంగాణలో లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో ఏపీ నుంచి వచ్చే అనుమతి లేని వాహనాలను రానివ్వొద్దని సిబ్బందికి సూచించారు. ఏపీ నుంచి వచ్చే వారు తెలంగాణ పోలీసులకు సహకరించాలని సూచించారు.
జిల్లాలో లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ వ్యవసాయ పనులు చేసుకోవచ్చని... ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి: 'అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు'