ETV Bharat / state

సడలిన అప్రమత్తత... ఇంకా పొంచి ఉన్న వైరస్ ముప్పు - Telangana news

మొన్నటివరకు చేతులెత్తి నమస్కరించారు. ఇప్పుడు కరచాలనం చేసుకుని పలకరించుకుంటున్నారు. ఎవరైనా పక్కన నిల్చుంటేనే అనుమానంగా చూశారు. కానీ ఇప్పుడు కలియతిరుగుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా మనం కొవిడ్ నుంచి భద్రమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.

సడలిన అప్రమత్తత... ఇంకా పొంచి ఉన్న వైరస్ ముప్పు

author img

By

Published : Jan 3, 2021, 3:31 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2020 ఏప్రిల్ 2న తొలిసారిగా కొవిడ్ కేసు వెలుగుచూసి భయానక పరిస్థితి నెలకొన్న తర్వాత... అంతటా అప్రమత్తత కనిపించింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ప్రతి నెలా కేసులు పెరిగినా... గత ఆగస్టు నుంచి వైరస్ తీవ్రత తగ్గడం వల్ల ఏం కాదులేనన్న భావన ఏర్పడింది. కానీ సూర్యాపేట పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 22 మంది నూతన సంవత్సరం రోజు వ్యాధి బారిన పడ్డారు. ఈ ఘటనతో వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గలేదని అర్థమవుతోంది.

మళ్లీ మొదలు...

కరోనా తీవ్రతతో గతేడాది ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో లాక్​డౌన్ విధించడం వల్ల జనం బయటకు రాలేదు. అప్పట్నుంచి పండుగలు, వేడుకలే కాదు. ఒకరిద్దర్ని ఇంటికి పిలుద్దామన్న కుదరలేదు. ఏప్రిల్ నుంచి మొన్నటి దసరా వరకు ఏడు నెలల పాటు శుభకార్యాలు జరుపుకోలేదు. కానీ దసరా అనంతరం మంచి రోజులు మొదలవడం వల్ల ఇన్నాళ్లూ వేచిచూసిన జనం ఒక్కసారిగా విందులు, వేడుకలు చేస్తున్నారు.

భారీస్థాయిలో...

పెళ్లిళ్లు, పుట్టు వెంట్రుకలు, నూతన వస్త్రాలంకరణ, బారసాల వంటి కార్యక్రమాల్ని మునుపటి రీతిలో చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఇళ్లకే పరిమితమైన శుభకార్యాలు కాస్త ఇపుడు ఫంక్షన్ హాళ్లకు చేరాయి. గత రెండు నెలల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక్క హాలూ ఖాళీగా లేదు. హాజరయ్యే వారి సంఖ్య వంద, రెండు వందల మందికి బదులు అయిదారు వందలు, వెయ్యి దాటి పోయింది.

యాథాస్థితికి...

ఏదైనా వస్తే అతిగా భయపడటం, వెసులుబాటు దొరికితే పూర్తిగా వదిలేయడం... మన వద్ద ఉన్న అలవాటు. నిన్నటివరకు ఎదుటివారిని అనుమానంగా చూసిన ప్రజలు ప్రస్తుతం... కనీసం మాస్కులు కూడా వాడటం లేదు. శానిటైజర్లు అసలు కనిపించడమే లేదు. కరోనా కాలంలో రెండు చేతులెత్తి భారతీయ సంస్కృతిని గుర్తు చేసిన జనం... మళ్లీ యథాస్థితికి చేరుకున్నట్లు భావిస్తున్నారు.

ఆందోళనకరం...

ఇది ఆందోళనకర పరిణామమేనని వైద్యారోగ్య వర్గాలు చెబుతున్నాయి. కొత్త సంవత్సరం నాడు సూర్యాపేట పట్టణంలో ఒక వ్యక్తి ద్వారా ఒకే కుటుంబానికి చెందిన 22 మంది వైరస్ బారిన పడ్డారు. జిల్లా కేంద్రం శివారులోని యాదాద్రి, జాహ్నవి టౌన్​షిప్​లపై అధికారులు అప్రమత్తత ప్రకటించారు. శనివారం సైతం సదరు ప్రాంతాల్లో మరో రెండు కేసులు నమోదయ్యాయి.

జాగ్రత్తే శ్రీరామరక్ష...

నిజానికి ఇప్పటికీ ఫంక్షన్లు చేసుకోవాలనేవారు స్థానిక పోలీసు ఠాణా అనుమతి తీసుకోవాల్సి ఉన్నా... ఎక్కడా అది అమలు కావడం లేదు. గత అక్టోబర్​కు ముందు ఒక పీహెచ్​సీలో నిత్యం వంద మంది వరకు పరీక్షలు చేయించుకుంటే... ప్రస్తుతానికి ఆ సంఖ్య 20 నుంచి 30 దాటడం లేదు. లక్షణాలు ఉన్నవారే కొవిడ్ పరీక్షలకు వస్తున్నారు. పైకి బాగానే కనిపిస్తున్నా... జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమేనని వైద్యారోగ్యశాఖ అంటోంది.

ఇదీ చూడండి : 'ప్రపంచానికి టీకా అందించే సత్తా భారత్​కే ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.