సూర్యాపేట జిల్లాలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ భాస్కరన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో లాక్డౌన్ అమలవుతున్న తీరును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. వీధుల్లో ఎదురుపడిన ద్విచక్ర వాహనదారులను ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనవసరంగా ప్రజలు బయటకు రావద్దని ఎస్పీ కోరారు. బయట తిరిగితే కేసులు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించిన 370 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి: వైరస్ వ్యాప్తి తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాలి: సీపీ అంజనీకుమార్