సూర్యాపేట జిల్లా కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును.. ఖమ్మంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజాయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. బస్సులో శానిటైజర్ లేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే నల్గొండ ఆర్ఎం వెంకన్నతో ఫోన్లో మాట్లాడి.. కోదాడ డీఎం రాజీవ్ ప్రేమ్ కుమార్ను తక్షణమే సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నియమాలు తప్పక పాటించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు