సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఎండీఆర్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి మోహిన్ బాబా మెదడు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి గమనించిన స్కూలు యాజమాన్యం మానవత్వంతో స్పందించింది.
వైద్య సహాయ నిమిత్తం స్కూల్ తరఫున విద్యార్థి తండ్రి రఫీకి రూ.1,02,154 చెక్కును పాఠశాల ఛైర్మన్ దామోదర్ రెడ్డి అందజేశారు. ఈ ఆర్థిక సహాయం అందుకున్న మోహిన్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: విపత్కర పరిస్థితుల్లో ఆత్మరక్షణతోనే దేశరక్షణ!