ETV Bharat / state

రసాయనాన్ని పిచికారి చేసిన సర్పంచ్​

ప్రజాప్రతినిధి అంటే ప్రజల సంక్షేమం కోరుకునే వ్యక్తి అనే మాటకి ఉదాహరణ పోలుమల్లు సర్పంచ్​. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు సర్పంచ్​ చిలువేరు భవాని స్వయంగా సోడియం హైపో క్లోరైడ్​ను స్ప్రే చేసి ఆదర్శంగా నిలిచారు.

chemical
రసాయనాన్ని పిచికారి చేసిన సర్పంచ్​
author img

By

Published : Apr 9, 2020, 3:29 PM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్లు గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మహిళా సర్పంచ్​ చిలువేరు భవాని వీధుల్లో రసాయనాన్ని పిచికారీ చేశారు. గ్రామ ప్రజలను వైరస్​ బారిన పడకుండా ఉండేదుకు మహిళా సర్పంచే స్వయంగా సోడియం హైపో క్లోరైడ్​ను స్ప్రే చేసి ప్రజల్ని చైతన్యపరచడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. గ్రామాభివృద్ధితో పాటు గ్రామప్రజల సంరక్షణ కూడా తమ బాధ్యతేనని సర్పంచ్​ గుర్తుచేశారు.

వైరస్​ ప్రభావం తగ్గేత వరకు తామంతా ప్రభుత్వ నిబంధనల్ని పాటిస్తామని పోలుమల్లు గ్రామ ప్రజలు చెబుతున్నారు. రసాయనాన్ని పిచికారి చేసి సర్పంచ్​ తమ బాధ్యతను గుర్తు చేశారని గ్రామస్థులు అంటున్నారు.

ఇవీ చూడండి: కరోనా ఉన్మాదం: దుకాణంలో సరకులను నాలుకతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.