ETV Bharat / state

'ఈనాడు-ఈటీవీ భారత్​' కథనానికి స్పందన.. వృద్ధ దంపతులకు ఆర్థికసాయం - financial support to old age couple in suryapet district

సూర్యాపేట జిల్లా వెంకేపల్లికి చెందిన వృద్ధ దంపతులు పిట్టల పాపయ్య, రామనర్సమ్మల దీనస్థితిపై 'ఈనాడు-ఈటీవీ భారత్​' ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. పలువురు దాతలు స్పందించి.. రూ.15 వేల నగదు, నిత్యావసర సరుకులను వృద్ధ దంపతులకు అందించారు.

వృద్ధ దంపతులకు ఆర్థిక సహాయం
వృద్ధ దంపతులకు ఆర్థిక సహాయం
author img

By

Published : May 7, 2021, 3:16 PM IST

'ఈనాడు-ఈటీవీ భారత్​'లో గత నెల 8న ప్రచురితమైన 'ఆధార్ లేక-ఆసరా దక్కక' కథనానికి స్పందన లభించింది. సూర్యాపేట జిల్లా నూతనకల్​ మండలం వెంకేపల్లికి చెందిన వృద్ధ దంపతులు పిట్టల పాపయ్య, రామనర్సమ్మలకు పలువురు దాతలు అండగా నిలిచారు. రూ.15 వేల నగదు, నిత్యావసరాలు సమకూర్చి.. గ్రామ సర్పంచ్ మాతంగి సోమనర్సమ్మ చేతుల మీదుగా వాటిని వృద్ధ దంపతులకు గురువారం అందించారు.

ఈ సందర్భంగా దాతలు స్పందించి సాయం చేసినా.. అధికారులు మాత్రం ఒక్కరూ స్పందించలేదని, వృద్ధ దంపతులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని గ్రామస్థులు మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. ఇంట్లో ఒక్కరికైనా పింఛన్ అందించాలని కోరారు.

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం వెంకేపల్లిలో కళ్లు కనిపించని పిట్టల పాపయ్య, భార్య రామనర్సమ్మతో కలిసి గుడిసెలో జీవనం వెల్లదీస్తున్నాడు. వృద్ధ దంపతులైన వీరికి ఆధార్​ కార్డు లేదని పింఛన్​, రేషన్​ కార్డు తొలగించడంతో రోడ్డునపడ్డారు. వీరి దీనస్థితిపై ఈనాడు-ఈటీవీ భారత్ గత నెల 8న 'ఆధార్ లేక-ఆసరా దక్కక' పేరిట కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన దాతలు వృద్ధ దంపతులకు ఆపన్నహస్తం అందించి అండగా నిలిచారు.

ఇదీ చూడండి: పడకలు కావాలన్నా, మృతదేహాలు తరలించాలన్నా రూ.వేలల్లో వసూలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.