తమ గ్రామంలో ప్రభుత్వం నిర్మిస్తున్న శ్మశానవాటికకు దారి కావాలంటూ సూర్యాపేట జిల్లాలోని పేరబోయిన గ్రామస్థులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కొంతకాలం క్రితం ప్రభుత్వం నుంచి శ్మశాన వాటికకు బిక్కేరు వాగు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఇటీవల దాని నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి.
అయితే గ్రామంలో పేరుకుబోయిన నాగరాజు అనే రైతు శ్మశాన వాటికకు వెళ్లడానికి దారి లేదని, ఆ భూమి తన పేరున పట్టా ఉందంటూ పనులను అడ్డుకున్నాడని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని గ్రామ అవసరాల కోసం నిర్మిస్తున్న శ్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయాలని.. గ్రామ సర్పంచ్ చిగుళ్ల స్వరూప ఆధ్వర్యంలో తహసీల్దార్ లక్ష్మీనరసింహారావుకు వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చదవండి: భూ ఆక్రమణలకు చైనా క్యాబేజీ వ్యూహం..!