ETV Bharat / state

బ్లాక్​ ఫంగస్​తో ప్రైవేట్​ ఉపాధ్యాయుడు మృతి - suryapet district crime news

రాష్ట్రంలో బ్లాక్​ ఫంగస్​ మరణాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు బ్లాక్​ ఫంగస్​తో మృత్యువాతపడ్డాడు. కరోనాను జయించినా.. ఫంగస్​ను ఎదుర్కోలేక ప్రాణాలు విడిచాడు.

died due to black fungus in kodada suryapet district

author img

By

Published : May 21, 2021, 11:02 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కె.వి.ఎస్​.రంగారావు అనే ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు బ్లాక్​ ఫంగస్​తో గురువారం మరణించారు. ఇటీవల కరోనా బారినపడిన రంగారావు.. వైరస్ నుంచి కోలుకున్నారు. ఆ తర్వాత అనారోగ్యం బారినపడటంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

రంగారావును పరీక్షించిన వైద్యులు ఆయనకు బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందారు. రంగారావు మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇదీ చూడండి: జీహెచ్​ఎంసీలో మరో వంద అన్నపూర్ణ కేంద్రాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.