సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు గ్రామ శివారులో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదల ఇళ్లను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డున పడ్డాం
బతుకు దెరువు కోసం ఉన్న ఊరుని వదిలి పక్క ఊరుకు వలస వచ్చి గ్రామ శివారులో పంచాయతీ అనుమతితో నివాసం ఏర్పరుచుకొని ఐదేళ్లుగా నివాసం ఉంటున్నామని బాధితులు తెలిపారు. ఇళ్లను ఖాళీ చేయమంటే చేసే వాళ్లమని కానీ సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చివేశారని వాపోయారు. తమ ఇళ్లలో ఆరోగ్యం బాగాలేక మంచాన పడ్డవారున్నారని ఆవేదన చెందారు. కొంత డబ్బు దాచుకొని గూడు ఏర్పరుచుకున్నామని.. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ సంక్షోభం సమయంలో బ్యాంకుల్లో పెరిగిన డిపాజిట్లు