ETV Bharat / state

ఎంతో కొంత పరిహారం ఇప్పించండి దొర

వాళ్లంతా పేదలు. రెక్కల కష్టం నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.  ఈ పేదల భూమిని సూర్యాపేట జిల్లా అధికారులు పైసా చెల్లించకుండా లాక్కున్నారు.  తమకు ఎంతో కొంత పరిహారం ఇవ్వండి అంటూ... అధికారుల చుట్టూ తిరుగుతున్నా, వీరి గోడును పట్టించుకున్న నాధుడే లేరు.

మా గోడు వినరూ..!
author img

By

Published : Jun 29, 2019, 2:28 PM IST

మా గోడు వినరూ..!

సూర్యాపేట శివారులోని నల్లచెరువు శిఖం 671 సర్వే నెంబర్లో 93 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని పట్టణానికి చెందిన పలువురు పేదలకు 1958లో అప్పటి ప్రభుత్వం సేద్యం కోసం పంపిణీ చేసింది. ఇటీవల ప్రభుత్వాలు కొత్తగా అమలు చేసిన పట్టాలు కూడా మంజూరయ్యాయి. సద్దుల చెరువు నుంచి వచ్చే మూసీ నీటితో రెండు పంటలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే జిల్లా కేంద్రంగా సూర్యాపేట మారడమే వారి పాలిట శాపంలా మారింది.
పోలీస్​ మార్క్​
హైదరాబాద్ - విజయవాడ రహదారికి సమీపంలో ఉన్న భూమిలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుపై అధికారుల దృష్టి సారించారు. 671 సర్వే నెంబర్లో 93 గుంటల ప్రభుత్వ భూమిని జిల్లా ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించారు. కోటి ఆశలతో పుడమి తల్లిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులకు ప్రభుత్వ నిర్ణయం కన్నీరును మిగిల్చింది. పొలాలను పోలీసుశాఖకు అప్పగించినందున భూమి వైపు కన్నెత్తి చూస్తే పోలీస్ మార్క్​తో వారిని దరిదాపుల్లో లేకుండా చేస్తున్నారు.
తెరాస కార్యాలయం కూడా...
ఈ ప్రాంతంలోనే పోలీస్ కార్యాలయంతో పాటు తెరాస పార్టీ జిల్లా కార్యాలయానికి కూడా స్థలాన్ని కేటాయించారు. మా భూముల్లో పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని అధికారపార్టీ ప్రతినిధులను ప్రశ్నించగా.. ప్రభుత్వం నుంచి భూమి కొన్నట్లు చెప్తున్నారని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ కలహాలు..
కొన్నేళ్ల కిందట ఇచ్చిన భూమిలో వారసత్వంగా వారి వారసులు సేద్యం చేసుకుంటున్నారు. కొందరు కట్నకానుకల కింద తమ బిడ్డలకు భూమిని అప్పగించారు. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నందు వల్ల వారి కాపురాల్లో కొత్త చిక్కులు ప్రారంభమయ్యాయి.
భూములు కోల్పోయిన వారికి పరిహారం అందిస్తామని మంత్రి జగదీశ్​రెడ్డి హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. ఇటీవల ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతంలో రైతులకు పరిహారం చెల్లించినట్టుగానే తమ కుటుంబాలకు కూడా ప్రభుత్వ ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల సీఎస్​ల భేటీ

Intro:Slug :. TG_NLG_21_29_POOR_FARMERS_LAND_KABJA_BYTES_PKG_C1

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ, సుర్యాపేట.

★ స్క్రిప్ట్ FTP లో వచ్చింది.

Body:...

Conclusion:..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.