మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు డా. గాదరి కిశోర్‌కుమార్ వాహనం ఆ వైపుగా రావడంతో పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్నీ తనిఖీ చేశారు. తనిఖీలకు పూర్తిగా సహకరించిన ఎమ్మెల్యే, సక్రమంగా విధులు నిర్వహించిన పోలీసులను అభినందించారు.
ఇదీ చూడండి: సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీశైల క్షేత్రం