ETV Bharat / state

ప్రజలు మనోధైర్యం కోల్పోవద్దు: ఎమ్మెల్యే గాదరి కిశోర్​

ప్రజలు మనోధైర్యం కోల్పోవద్దని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ తెలిపారు. ఆరు కరోనా పాజిటివ్​ కేసులు వచ్చిన వర్ధమానుకోటలో ఆయన పర్యటించారు.

MLA Kishore
MLA Kishore
author img

By

Published : Apr 7, 2020, 7:22 AM IST

కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి... ప్రజలు స్వీయనిర్బంధంలో ఉండాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ సూచించారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోటలో పర్యటించారు. గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడం బాధాకరమన్నారు. గ్రామస్థులు విధిగా మాస్కులు ధరించాలని కోరారు.

అధికారులు చెప్పిన విధంగా నడుచుకోవాలని తెలిపారు. ఈ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారన్నారు. గ్రామంలోని వారు బయటికి వెళ్లకుండా... బయటివారు లోనికి రాకుండా జాగ్రత్తలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్నా తక్షణమే చేస్తామన్నారు. గ్రామంలో సోడియం హైపోక్లోరైట్​ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

ప్రజలు మనోధైర్యం కోల్పోవద్దు : ఎమ్మెల్యే గాదరి కిశోర్​

ఇవీచూడండి: జూన్​ 3 వరకు లాక్​డౌన్​ చేయాలని సర్వేలు చెప్తున్నాయి: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.