ఇవీ చదవండి:చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తులు....
భక్తసంద్రంగా పెద్దగట్టు - భక్తులు
రెండో రోజు పెద్దగట్టు జాతర భక్తులతో కిక్కిరిసిపోయింది. లింగమంతుల స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
లింగమంతుల స్వామి
పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయం భక్త జనంతో నిండిపోయింది. జాతరలో తొలి రోజు... జాతరపెట్టెను తీసుకురాగా, రెండో రోజు చంద్రపట్నం కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన ఆలయ ఆవరణలో స్వామి, అమ్మవార్ల ఎదురుగా పసుపు, కుంకుమతో చంద్రపట్నం వేసి... దానిపై దేవరపెట్టెను ఉంచారు. ఈ కార్యక్రమాన్ని స్వామి వారి కల్యాణంగా భావిస్తారు. పూజారులుగా వ్యవహరించే తండు, మున్న వంశాలకు చెందిన వారు ఈ వేడుక నిర్వహించారు.
ఇవీ చదవండి:చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తులు....
sample description