ETV Bharat / state

కనుల పండువగా పెద్దగట్టు జాతర - పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర

యాదవ భక్తుల వీరనాలు, కటారులు, భేరీల విన్యాసాలతో సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు జాతర వైభవంగా జరుగుతోంది. దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతరకు పిల్లాపాపలతో కలిసి భక్తులు భారీగా తరలివచ్చారు. జాతరలో ప్రధాన అంకమైన దేవరపెట్టెను సూర్యాపేట మండలం కేసారం నుంచి యాదవ భక్తులు, పూజారులు, హక్కుదార్లు పెద్దగట్టుకు తరలించారు.

peddagattu-jathara-celebrations-in-suryapet
కన్నుల పండువగా పెద్దగట్టు జాతర
author img

By

Published : Mar 1, 2021, 5:25 AM IST

Updated : Mar 1, 2021, 6:41 AM IST

సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి అయిదు రోజుల పాటు కన్నుల పండువగా జాతర జరగనుంది. జాతరలో ప్రధాన అంకమైన దేవరపెట్టెను సూర్యాపేట మండలం కేసారం నుంచి యాదవ భక్తులు, పూజారులు, హక్కుదార్లు పెద్దగట్టుకు తరలించారు. గొర్ల గన్నారెడ్డి ఇంటి వద్ద బోనం బియ్యం, పట్టువస్త్రాలను మంత్రి జగదీశ్‌రెడ్డి ఎత్తుకుని సౌడమ్మపెట్టే ఉన్న చోటుకు వచ్చారు. అక్కడ కంకణాలు కట్టుకుని సుమారు 8కిలోమీటర్ల దూరంలోని పెద్దగట్టుకు చేరుకున్నారు. దేవతామూర్తులతో నిండిన దేవరపెట్టె గట్టుకు చేరుకోగానే... పెట్టెను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు. రేపు లింగమంతులస్వామికి బోనాలు, చోడమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తారు. జాతరకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు.

వాహనాల మళ్లింపు..

జాతర సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి మార్చి 4 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దురాజ్‌పల్లి వద్ద ఎన్‌హెచ్‌-65పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి-అద్దంకి రహదారికి మళ్లించారు. హైదరాబాద్‌కు వచ్చే వాహనాలు కోదాడ వద్ద దారి మళ్లించారు. హుజూర్‌నగర్‌-మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్‌కు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. హైవే వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ భాస్కరన్‌ కోరారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారకర్తలను నియమించిన కాంగ్రెస్‌

Last Updated : Mar 1, 2021, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.