సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీకలనాయక్ తండాలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన లకావత్ రామారావు కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మండలంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేశారని, అభివృద్ధి కార్యాక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని కొనియాడారు. రామారావు కుటుంబానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఏపీలో కొత్తగా 1886 కరోనా కేసులు.. 12 మరణాలు