సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తోన్న మహా ప్రస్థానాన్ని నల్గొండ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. సుమారు రూ. 5 లక్షలతో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు, రూ.25 లక్షలతో సీసీ రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని నిధులు వచ్చే విధంగా కృషిచేస్తామని తెలిపారు.
ఇవీచూడండి: గాంధీలో మరో వివాదం