ప్రతిపక్షాలు ఎన్నికుట్రలు చేసినా అంతిమంగా హుజూర్నగర్లో తెరాస జెండా ఎగటం ఖాయమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ప్రచార సమయంలో ఎంపీ రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హుజుర్నగర్లో పద్మావతికి టికెట్ ఇవోద్దని వ్యతిరేఖించిన రేవంత్రెడ్డి... ఎన్నికల ప్రచారంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. కోమటిరెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని పల్లా హితవు పలికారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండి: హైకోర్టు