ETV Bharat / state

స్వీయ నియంత్రణతోనే కరోనాను అరికట్టగలం: ఎమ్మెల్యే గాదరి - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఎంపీపీ నేమురు గొమ్ముల స్నేహలత-సురేందర్​రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గాదిరి కిశోర్​కుమార్ పాల్గొని పలు సూచనలు చేశారు.

Only self-control can stop the corona: MLA Gadri Kishore Kumar
స్వీయ నియంత్రణతోనే కరోనాను అరికట్టగలం: ఎమ్మెల్యే గాదరి
author img

By

Published : Sep 12, 2020, 9:04 PM IST

స్వీయ నియంత్రణతోనే కరోనాను అరికట్టవచ్చని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఎంపీపీ నేమురు గొమ్ముల స్నేహలత-సురేందర్​రావు అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంaలో ఆయన పాల్గొన్నారు.

కరోనాకు మందులేదని.. స్వీయ నియంత్రణ ద్వారానే వైరస్​ వ్యాప్తిని అరికట్టవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య శాఖ వారు ఇచ్చే మందులు రోగ నిరోధక శక్తిని పెంచేవే తప్పా.. కరోనాను తగ్గించేవి కావని తెలిపారు. గతంతో పోలిస్తే వైరస్ తీవ్రత తగ్గిందని.. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం విధిగా పాటించాలన్నారు.

అనంతరం వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని.. అధికారులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దూపటి అంజలి రవీందర్, వైస్ ఎంపీపీ బొద్దు సుజాత సైదులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మూల అశోక్​రెడ్డి, ఎంపీడీవో కె.ఉమేష్, ఏవో వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ హరిప్రసాద్, ఎంపీవో కె.మారయ్య, ఎంపీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.