సూర్యాపేట జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. కరోనా తొలి బాధితుడి వల్లే... రెండో వ్యక్తికి వైరస్ సోకింది. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్‌కు చెందిన యువకుడు... ఎంజీ రోడ్డులోని ఔషధ దుకాణంలో పనిచేస్తున్నాడు. తొలి పాజిటివ్ బాధితుడు మందుల కొనుగోలు కోసం దుకాణానికి రావడంతో... అందులో పనిచేసే వ్యక్తికి వ్యాధి సోకింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ధ్రువీకరించారు.
ఔషధ దుకాణంలోని ఆరుగురితోపాటు మొత్తం 45 మంది రక్త నమూనాల్ని పరీక్షలకు పంపగా... అందులో 16 మంది నివేదికలు వచ్చాయి. 15 మందివి నెగెటివ్ కాగా... ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఈ 45 మందిని ముందుగానే అధికారులు... క్వారంటైన్లో ఉంచారు. పాజిటివ్ వచ్చిన బాధితుడి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్నవారి నమూనాల్ని పరీక్షల కోసం పంపుతున్నారు.