సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో నివాసముంటున్న పగిళ్ళ సంపత్ కారు డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా అతని భార్య జ్యోతి పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని సంపత్ అనుమానించాడు. ఇదే విషయమై భార్యతో చాలా రోజులుగా గొడవపతున్నాడు. ఈ విషయంపై ఇటీవల భార్యాభర్తలిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది.
కోపంలో సంపత్ జ్యోతిపై చేయిచేసుకున్నాడు. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త సంపత్ అనుమానిస్తున్న తీరుపై కుటుంబ సభ్యులకు చెప్పింది. జ్యోతి సోదరుడు సురేష్.. తన బావపై కోపం పెంచుకున్నాడు. ఈ నెల 4వ తేదీన సూర్యాపేటలో బావ సంపత్‌ను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలైన సంపత్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సంపత్ తండ్రి పగిళ్ళ వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: అన్నదాతల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో తెలంగాణ