ETV Bharat / state

సూర్యాపేటలో రూ.లక్షా ఆరు వేల గుట్కా పట్టివేత - సుర్యాపేటలో భారీగా గుట్కా స్వాధీనం

నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఇద్దరిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.లక్షా ఆరు వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

one lakh Gutka confiscation by Suryapeta district polices
సూర్యాపేటలో రూ.లక్షా ఆరు వేల గుట్కా పట్టివేత
author img

By

Published : Jul 11, 2020, 9:55 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలోని కిరాణా దుకాణలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.లక్షా ఆరు వేలు ఉంటుందని వెల్లడించారు.

సింగారపు సైదులు, సింగారపు కోటయ్య అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వం నిషేధించిన గుట్కా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.