ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి - died news

ఈదురుగాలులకు ఓ వ్యక్తి బలయ్యాడు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తిలో వీచిన బలమైన గాలులకు ఓ వ్యక్తి ఇంటి రేకులు కదలగా.. వాటిని సరిచేసే క్రమంలో కరెంట్​ షాక్​ తగిలి ప్రాణాలొదిలాడు.

one died with current shock in suryapet district
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి
author img

By

Published : May 18, 2020, 10:27 PM IST

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన మన్నె ఎర్రయ్య (45) మృతి చెందాడు. ఈదురు గాలులకు ఎర్రయ్య ఇంటి రేకులు కదిలాయి. విద్యుత్ స్తంభం నుంచి ఇంటి రేకులకు చుట్టిన సర్వీస్ వైర్ తెగి రేకులకు తగిలింది. గమనించని ఎర్రయ్య... రేకులను సరిచేసే క్రమంలో విద్యుత్​ ప్రవహించి షాక్​ తగిలింది.

ఈ ప్రమాదంలో ఎర్రయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఎర్రయ్యకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. భార్య నిర్మల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో అగ్ర దేశాల సరసన భారత్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.