ETV Bharat / state

ప్రాణహాని లేదు..మెరుగైన చికిత్స అందిస్తున్నాం: జగదీశ్​రెడ్డి - accident at suryapet

కబడ్డీ పోటీల్లో గ్యాలరీ కూలిన ఘటనలో ఎవరికీ ప్రాణహాని లేదని మంత్రి జగదీశ్​రెడ్డి వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రి తరలించి.. మెరుగైన చికిత్స అందించినట్లు చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

jagadesh reddy
గ్యాలరీ కూలిన ఘటనలో ఎవరికీ ప్రాణహాని లేదు: జగదీశ్​రెడ్డి
author img

By

Published : Mar 22, 2021, 10:00 PM IST

జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డితో కలిసి బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఎవరికీ ప్రాణహాని లేదన్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందించామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగదీశ్​రెడ్డి హామీ ఇచ్చారు.

గ్యాలరీ కూలిన ఘటనలో ఎవరికీ ప్రాణహాని లేదు: జగదీశ్​రెడ్డి

సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో గ్యాలరీ కూలిపోయింది. సుమారు 150 నుంచి 200 మంది వరకు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.

ఇవీచూడండి: కబడ్డీ పోటీల్లో అపశ్రుతి.. 150 నుంచి 200 మంది వరకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.