ETV Bharat / state

సిబ్బందికి నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ

ప్రస్తుత పరిస్థితుల్లో పారిశుద్ధ్య, వైద్య ఆరోగ్య సిబ్బంది తమ సేవలతో అండగా నిలిచారని మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 500మంది సిబ్బందికి నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు.

new cloths and fruits distribution to workers by minister jagasidh reddy in kodada
సిబ్బందికి నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ
author img

By

Published : May 1, 2020, 4:20 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడలో మే డే సందర్భంగా ఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి... 500 మంది పారిశుద్ధ్య, వైద్య ఆరోగ్య సిబ్బందికి నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచానికి అండగా నిలిచారని కొనియాడారు. లాక్​డౌన్ తర్వాత కూడా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రేపటి నుంచి తెల్లరేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500 ఖాతాలో జమ అవుతాయని మంత్రి తెలిపారు. లాక్​డౌన్​ అమలులో ప్రభుత్వం విజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్​ ఛైర్​పర్సన్​ వనపర్తి శిరీష పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.