ETV Bharat / state

త్రివర్ణ పతాకానికి పురిటిగడ్డ నడిగూడెంకు గుర్తింపు దక్కిందా...? - నడిగూడెం

భారతజాతి ఐక్యతకు సంకేతం... మువ్వన్నెల పతాకం. 130 కోట్ల మంది భారతీయులు సగౌరవంగా నమస్కరించే జెండా త్రివర్ణ పతాకం. జాతీయ గీతం విన్నా... త్రివర్ణ పతాకం రెపరెపలు వీక్షించినా... ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగిపోతుంది . అలాంటి జెండాకు ఊపిరి పోసింది పింగళి వెంకయ్య. అదీ... సూర్యాపేట జిల్లా నడిగూడెం రాజావారి కోటలోనే....

national flag village nadigudem history
national flag village nadigudem history
author img

By

Published : Aug 16, 2020, 5:09 AM IST

పూర్వం నందిగామ తాలూకా మునగాల పరిగణలో నడిగూడెం ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉంది. అప్పట్లో మునగాల పరగణను రాజానాయిని వెంకటరంగారావు పాలించేవాడు. పత్తి వంగడలపై పరిశోధన చేయుటకు పింగళి వెంకయ్యను రాజానాయిని వెంకటరంగారావు నడిగూడెంకు తీసుకొచ్చారు. భారతదేశానికి జెండా ఉండాలని గాంధీజీ పిలుపుమేరకు పింగళి వెంకయ్య పతాకాన్ని రూపొందించారు.

బెజవాడలోని విక్టోరియామహల్లో జెండాను గాంధీజీకి పింగళి వెంకయ్య అందజేశారు. జెండాలో రాట్నం తొలగించి అశోకచక్రాన్ని ఉంచి గాంధీజీ ఆమోదించారు. అంతటి ఘన చరిత్ర ఉన్న నడిగూడెం రాజావారి కోటకు సరైన గుర్తింపు దక్కడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని నడిగూడెంలో మ్యూజియంను ఏర్పాటు చేసి... ఏటా స్వతంత్ర వేడుకలను నిర్వహించాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీచూడండి: బామ్మ అభ్యర్థనకు ముగ్ధుడైన మంత్రి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.