సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో హుజూర్నగర్ తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి తరఫున నందమూరి సుహాసిని ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారని, ఆర్టీసీ కార్మికుల పొట్ట కొడుతూ వారి చావులకు కారణమయ్యారని మండిపడ్డారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిందేమీ లేదని, సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.
ఇవీ చూడండి: 2018-19లో సత్య నాదెళ్ల వార్షిక సంపాదన రూ.300 కోట్లు