ETV Bharat / state

'ప్రేమ' వికటించింది.. పిల్లల్ని కన్నతల్లే నీటిలో తోసి చంపేసింది? - ఇద్దరి పిల్లలను చంపిన తల్లి

దంపతుల మధ్య తరచూ చోటుచేసుకుంటున్న గొడవలు... ఇద్దరు పిల్లల ప్రాణాలు తీశాయి. పేగు పంచుకు పుట్టిన బిడ్డలు కళ్ల ముందే కన్నుమూస్తుంటే... చేసేది లేక రోదిస్తూ పలువురి కంట పడిందా తల్లి. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న సూర్యాపేట ఘటనలో... పిల్లల్ని తానే చెరువులోకి తోసేసిందా లేక... ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

mother-threw-her-two-children-into
'ప్రేమ' వికటించింది.. పిల్లల్ని కన్నతల్లే నీటిలో తోసి చంపేసింది?
author img

By

Published : Jun 15, 2020, 4:36 PM IST

Updated : Jun 15, 2020, 8:53 PM IST

'ప్రేమ' వికటించింది.. పిల్లల్ని కన్నతల్లే నీటిలో తోసి చంపేసింది?

మనసు, మనసు కలవడంతో పద్నాలుగేళ్ల క్రితం... ప్రేమ వివాహం చేసుకున్నారు. తన తల్లిదండ్రులు ఒప్పుకోకున్నా అత్తగారి తరఫు వారు పెళ్లి చేయడం వల్ల... సొంతూరు వదిలిపెట్టాడు. భార్య కుటుంబ సభ్యుల చెంతన ఉండాలని భావించి... వారికి దగ్గర్లోనే కాపురముంటున్నాడు. కొడుకు, కూతురితో అన్యోన్యంగా కనిపించిన ఆ కుటుంబం... అంతర్గత గొడవలతో అతలాకుతలమైంది. దంపతుల మధ్య నెలకొన్న అనుమానపు బీజాలు... చివరకు ఇద్దరు చిన్నారులను పొట్టనబెట్టుకున్నాయి.

సూర్యాపేటలో ఇద్దరు పిల్లల్ని చెరువులోకి తోసేసిన ఘటన... హృదయవిదారకంగా మారింది. తాను దూకలేక ఒడ్డున కూర్చుందా లేక... కావాలనే పిల్లలిద్దర్నీ వదిలించుకుందా అనే కోణంలో విచారణ సాగుతోంది. హైదరాబాద్​కు చెందిన తాయి ప్రశాంత్, సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్ మండలం సింగిరెడ్డిపాలేనికి చెందిన నాగమణిలది ప్రేమ వివాహం. నాగమణి కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లింది. అక్కడ ప్రశాంత్ పరిచయమయ్యాడు. ఆ బంధం పెళ్లివరకూ దారితీసింది. ఆదిలో ఆ దంపతుల అన్యోన్యతను చూసి అందరికీ కన్ను కుట్టేది. ఆ ఆత్మీయతలో అనుమానమనే చిచ్చు రేగింది.

ఎలా జరిగింది

సూర్యాపేటలోని విద్యానగర్​లో నివాసముంటున్న ప్రశాంత్ దంపతులకు ఎనిమిదేళ్ల కుమార్తె జ్యోతిమాధవి, ఆరేళ్ల బాబు హర్షవర్ధన్ ఉన్నారు. ఇవాళ వేకువజామున తన పిల్లలు చెరువులో పడిపోయారని.. నాగమణి ఒడ్డున కూర్చుని ఏడుస్తోంది. ఉదయపు నడకకు వెళ్లిన వారు ఆరా తీశారు. తానే పిల్లలిద్దర్నీ నీళ్లలోకి తోసేశానంటూ చెప్పిన ఆ కర్కశ మాతృమూర్తి... తనకు మాత్రం దూకేందుకు ధైర్యం చాలలేదని వాపోయింది. అయితే ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగినట్లు ఆమె చెబుతుండగా... విషయం పోలీసులకు చేరింది.

బంధువులేమంటున్నారు

ముందుగా కుమారుడి మృతదేహం నీటిపై తేలింది. కూతురు మృతదేహం కోసం గాలింపు చేపట్టగా... మరో మూడు గంటల తర్వాత దొరికింది. అప్పటికే నాగమణి అక్కడి నుంచి వెళ్లిపోయింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతోపాటు ఒకరిపై మరొకరికి అనుమానం ఉండటం కూడా... పిల్లల ఉసురు తీయడానికి కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

విచారణ సాగుతోందిలా..

భర్తతో మనస్పర్ధల వల్ల పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకోవాలని భావించిందా.... లేక పిల్లల్ని తోసేసి ఏమీ ఎరగనట్లు నటిస్తోందా... అనే కోణంలోనూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో విగతజీవులుగా మారిన పిల్లలు నీరు మింగినట్లు కనపడకపోవడం... కుమార్తె నోటి పైభాగంలో దెబ్బతాకి ఉండటంతో... ఘటనకు గల కారణాలపై పోలీసులు దృష్టిసారించారు. అభం శుభం తెలియని చిన్నారులు విగతజీవులుగా మారిన చూపరులను కంటతడి పెట్టించింది.

ఇదీ చూడండి: అనుమానాస్పద స్థితిలో బ్యాంకు ఉద్యోగి మృతి

Last Updated : Jun 15, 2020, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.