ETV Bharat / state

'కాంగ్రెస్​ గెలిస్తే ఉత్తమ్​ కుటుంబమే అభివృద్ధి చెందుతుంది' - mlc palla rajeswar reddy

హుజూర్​నగర్​లో గులాబీ జెండా ఎగురవేస్తామని తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ గెలిస్తే ఉత్తమ్ కుమార్ ​రెడ్డి కుటుంబం మాత్రమే లాభపడుతుందని.. తెరాస విజయం సాధిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.

'కాంగ్రెస్​ గెలిస్తే ఉత్తమ్​ కుటుంబమే అభివృద్ధి చెందుతుంది'
author img

By

Published : Sep 27, 2019, 9:20 PM IST

Updated : Sep 28, 2019, 7:25 AM IST

హుజూర్​నగర్​ ఉపఎన్నికలో 40 వేల మెజార్టీతో విజయం సాధిస్తామని తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు సైతం తెరాస వైపు చూస్తున్నారన్నారు. విపక్షంగా ఉన్నందున కాంగ్రెస్​ పార్టీ విజయం సాధిస్తే హుజూర్​నగర్​ అభివృద్ధి చెందదని పద్మావతిరెడ్డి నేరుగా చెప్పినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్​ గెలిస్తే ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కుటుంబం మాత్రమే లాభపడుతుందని.. తెరాస విజయం సాధిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కేసీఆర్​ చేపట్టిన పథకాలే తమ ఓటు బ్యాంకని రాజేశ్వర్​ రెడ్డి పేర్కొన్నారు. గతంలోనూ కాంగ్రెస్​కు అండగా నిలిచిన స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసినట్లు గుర్తుచేశారు. కేవలం ఏడు వేల మెజార్టీ సాధించిన ఉత్తమ్​.. కేటీఆర్​ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

'కాంగ్రెస్​ గెలిస్తే ఉత్తమ్​ కుటుంబమే అభివృద్ధి చెందుతుంది'

ఇవీ చూడండి: 'హుజూర్​నగర్​లో అధికార దుర్వినియోగానికి తెరాస కుట్ర'

sample description
Last Updated : Sep 28, 2019, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.