సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలో సుమారు రూ.60 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవననానికి ఎమ్మెల్యే సైదిరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. పనులను త్వరితగతిన పూర్తిచేసి పంచాయతీ భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన ట్రైబల్ స్కూల్, పాలిటెక్నిక్ కాలేజీలను మేళ్ల చెరువులోనే ఏర్పాటు చేసే విధంగా కృషిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: నేడు గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన