సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని 18, 19, 20, 21 వార్డులలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి జెండా ఆవిష్కరించి పలు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ జెండా ఎగురవేసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్క నాటితే.. తెలంగాణ ఆకుపచ్చగా మారుతుందని అన్నారు.
హుజూర్ నగర్ నియోజకవర్గలో పౌరులందరూ మొక్కలు నాటి.. హరిత విప్లవాన్ని సృష్టించాలన్నారు. రాబోయే తరాల వారికి స్వచ్ఛమైన గాలి అందించే బాధ్యత మనదే అన్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి.. వాటి బాధ్యత స్వీకరించి వృక్షాలుగా అయ్యే వరకు సంరక్షించాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ.. మురుగు కాల్వలు, నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా.. పారిశుద్ధ్య సిబ్బందితో పాటు.. ప్రజలు కూడా బాధ్యత స్వీకరించాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ గెల్లి అర్చన రవి, మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు