సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికులు 12వ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. వీరికి ములుగు ఎమ్మెల్యే సీతక్క మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనలో ఉద్యోగస్థులు, కార్మికులు, ప్రజలు విసిగిపోయారని అన్నారు. తక్షణమే కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః "సర్కారు స్పందిచలేదు.. సమ్మెపై వెనక్కి తగ్గేదిలేదు"