హుజూర్నగర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంకుశ వలి, జడ్పీటీసీ, ఎంపీపీ పాల్గొన్నారు. ప్లాసిక్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సైదిరెడ్డి కోరారు. మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన రూ. 50 కోట్ల నిధులను నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచేందుకు ఉపయోగిస్తామని సైదిరెడ్డి తెలిపారు. ఈ నెల 27 నుంచి అన్ని వార్డుల్లో 30 రోజుల ప్రణాళిక కార్యచరణ మొదలుకానుందని.. ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఇదీ చూడండి : ఎర్రబెల్లి కాన్వాయి వాహనం బోల్తా.. ఇద్దరు దుర్మరణం