కరోనా వైరస్ సోకిన వారిని కించపరిచే విధంగా ప్రవర్తించవద్దని.. వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే విధంగా భరోసా కల్పించాలని నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే సైదిరెడ్డి కోరారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల పట్టణంలో నూతనంగా నిర్మించిన తెరాస కార్యాలయాన్ని ప్రారంభించారు. కొవిడ్ మహమ్మారి సోకినవారికి మానసిక ధైర్యాన్ని కలిగించండి. వైరస్‌తో చనిపోయినవారి దహనసంస్కారాలు గ్రామంలో జరిగేలా చూడాలన్నారు
పట్టణాల అబివృద్ది తెరాస ప్రభుత్వ ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సమన్వయంతో ఉంటూ పార్టీ బలోపేతానికి తోడ్పడాలని అన్నారు. త్వరలో హుజుర్నగర్లో ఇండస్ట్రీయల్ పార్క్ఏర్పాటు కాబోతున్నదని.. నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
ఇదీ చదవండి: పునాది రాయితో పులకించిన అయోధ్య