నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో గిరిజనులను తప్పుదోవ పట్టించడమే 'భాజపా గిరిజన భరోసా యాత్ర' ముఖ్య ఉద్దేశమని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో భాజపా నేతల తీరు దారుణమని మండిపడ్డారు. అరాచకం సృష్టించేలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి పాటుపడిన ప్రభుత్వం తెరాస మాత్రమేనని స్పష్టం చేశారు. గిరిజన గ్రామాల్లో ఎక్కువమంది తెరాస సర్పంచులే ఉన్నారని తెలిపిన ఎమ్మెల్యే.. ఈ ఏడేళ్లలో హుజూర్‌నగర్ ప్రాంతాన్ని పచ్చనిపొలాలుగా మార్చామని చెప్పారు. ప్రతి తండాకు నీరిచ్చేలా తెరాస ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
సంబంధిత వార్త: 'తెరాసతో యుద్ధం మొదలైంది.. గుణపాఠం చెబుతాం'
ఇదీ చదవండి: యువత అన్ని రంగాల్లో ఆల్‌రౌండర్‌గా రాణించాలి: హరీశ్‌రావు