సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో రూ. 3 కోట్ల 50 లక్షల వ్యయంతో కస్తూర్బా ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి తుంగతుర్తి ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం త్వరితగతిన నాణ్యతా లోపాలు లేకుండా పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు నియంత్రణ ఒక్కటే మార్గమని ఎమ్మెల్యే అన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వ నియమాలు పాటించాలని.. అర్హులైన వారందరూ టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ రజాక్, జడ్పీటీసీ కన్నా సూరంభ వీరన్న, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తిప్పతీగతో కరోనా ఫట్.. ఆ సీక్రెట్ తెలుసుకోండి..!