ETV Bharat / state

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - కల్యాణలక్ష్మి

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేగదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​ అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్​ మండల కేంద్రంలో 59 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు.

mla gadari kishore distributed kalyanalaxmi, shadi mubarak cheques in suryapet district
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Sep 5, 2020, 12:25 PM IST

సూర్యాపేట జిల్లా నూతనకల్​ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 59 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​, జడ్పీ ఛైర్​పర్సన్​ గుజ్జ దీపికా యుగంధర్​రావు పంపిణీ చేశారు. గత ఆరు నెలలుగా కరోనా నేపథ్యంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కల్యాణలక్ష్మి , షాదీముభారక్ పథకాలు పేదింటి ఆడపిల్లలకు ఒక గొప్ప వరమన్నారు.

సీఎం కేసిఆర్ ప్రతి పేదవాడి పెద్ద కొడకుగా తన చెల్లెలికి పెళ్లి కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ ఎస్​ఏ.రజాక్, ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవ రెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్ రెడ్డి, ప్యాక్స్​ ఛైర్మన్ కనకటి వెంకన్న, వైస్ ఎంపీపీ పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.