సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం, మద్దిరాల మండలాల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్ పర్యటించారు. జాజిరెడ్డిగూడెం ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీటీసీల వీడ్కోలు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధికి బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మద్దిరాల మండలంలో కల్యాణి లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. 164 మంది లబ్ధిదారులకు 1 కోటి 64 లక్షల 19 వేల రూపాయిల విలువైన చెక్కులను అందించారు.
ఇవీ చూడండి: 'హరిత, నీలి విప్లవం తరహాలో విత్తన విప్లవం రావాలి'