సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో లోకకల్యాణార్థం, కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వేద పండితులతో నాభిశిలకు మహాఘట్టాభిషేక మహోత్సవంను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిర్వహించారు. వేదమంత్రాల నడుమ బొడ్రాయికి 108 కలశాలతో కుంభాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు.
అనంతరం సీతాలదేవి అమ్మవారికి పూజలు నిర్వహించారు. కోదాడ నియోజకవర్గ ప్రజలు ప్రతి ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రపరచుకోవాలని సూచించారు. ఇంటి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రపరిచి ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని అన్నారు. కరోనా నియంత్రణలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కరోనాను లెక్కచేయని జనం- వైభవంగా ఉత్సవం