సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జిని ప్రారంభిస్తారు. గతంలో అప్రోచ్ రోడ్డు విషయంలో ఉన్న వివాదం తొలగిపోవడం వల్ల రోడ్డు పనులు పూర్తిచేశారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఏపీ, తెలంగాణ సరిహద్దులో రవాణా సమస్యలు తగ్గుతాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రులు... ఉదయం మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనున్నారు. మధ్యాహ్నం బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అనంతరం గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో రూ. 2.56 కోట్లతో నిర్మించనున్న పీఎంజీఎస్వై రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత నూతనంగా ఏర్పడిన నేరేడుచెర్ల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1481 కరోనా కేసులు, 4 మరణాలు