సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలో శ్రీకంఠమహేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ ఛైర్మన్ పోతరాజు రజిని, మండల తెరాస అధ్యక్షుడు కళ్లెట్లపల్లి ఉప్పలయ్య, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గుండగాని అంబయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ధాన్యం అమ్ముకునేందుకు టోకెన్లు.. వాటి కోసం క్యూ లైన్లు